14 August, 2026 | 3:52 PM

Breaking News

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ, రోడ్డు సౌకర్యం కల్పించాలి   •   సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి   •   హల్ద్వానీ ఘటనకు నిరసనగా కామారెడ్డిలో సత్యాగ్రహ దీక్ష   •   గీత దాటితే సీఎంతో సహా అందరూ ఒకటే: రాజగోపాల్‌పై పీసీసీ చీఫ్‌ ఆగ్రహం   •   రామాలయంలో ప్రారంభమైన లలిత సహస్రనామాల పారాయణం.   •   నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును కాపాడాలి: చాడ వెంకటరెడ్డి   •   ఈనెల 16న జయశంకర్ జిల్లా క్రికెట్ క్రీడాకారుల సమావేశం   •   సెప్టెంబర్ మొదటివారంలో పనులు మొదలు కావాల్సిందే   •   జేపీ నడ్డాకు అస్వస్థత.. ఎయిమ్స్ కీలక ప్రకటన   •   వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి జిల్లా పోలీసులు   •  

జేపీ నడ్డాకు అస్వస్థత.. ఎయిమ్స్ కీలక ప్రకటన

14-08-2026 03:06 PM

కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు అస్వస్థత 

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జే.పీ. నడ్డా(Union Health Minister JP Nadda hospitalised) అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన నడ్డాను ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS)లో చేర్చినట్లు ఆసుపత్రి వర్గాలు శుక్రవారం తెలిపాయి. గురువారం ఆసుపత్రిలో చేరిన నడ్డాకు కరోనరీ యాంజియోగ్రఫీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పర్యవేక్షణ కోసం ఆయనను కార్డియాలజీ విభాగంలో చేర్చారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. "అస్వస్థత కారణంగా, ఆగస్టు 13, 2026 సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డాకు కరోనరీ ఆంజియోగ్రఫీతో సహా పలు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, పర్యవేక్షణ నిమిత్తం ఆయనను ఎయిమ్స్ (AIIMS)లోని కార్డియాలజీ విభాగంలో చేర్చారు." అని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది