14 August, 2026 | 4:31 PM

రామాలయంలో ప్రారంభమైన లలిత సహస్రనామాల పారాయణం.

14-08-2026 03:30 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని రామాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మహిళ భక్తులు లలిత సహస్రనామాల పారాయణ కార్యక్రమాన్ని చేపట్టారు. లలిత సహస్ర నామాల పారాయణం వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు ఆధ్యాత్మికత భక్తి భావాలు పెరుగుతాయని పూజారి సుధా జోషి పేర్కొన్నారు. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే శ్రావణమాసంలో పారాయణం చేయాలని కోరారు.