06-02-2026 12:13:06 AM
బంజారాహిల్స్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న స్ట్రీక్ హౌస్ లేవంట్ హోటల్లో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం హోటల్ వంటగదిలోని చిమ్నీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సిబ్బంది, వినియోగదారులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన హోటల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫిలింనగర్ ఫైర్ స్టేషన్ నుంచి ఘట నా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి పెను ప్రమాదాన్ని తప్పించారని స్థానికులు తెలిపారు.