12 June, 2026 | 2:27 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

అందరికీ న్యాయం చేస్తాం, కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయండి

06-02-2026 12:13 AM

రెబల్స్‌కు, విత్ డ్రా చేసుకున్న నాయకులకు భరోసా కల్పించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 

కరీంనగర్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): వివిధ డివిజన్లలో పార్టీ టికెట్ ఆశించి టికెట్ రాక పోవడంతో రెబల్స్ గా పోటీ లో ఉన్న అభ్యర్థులు, నామినేషన్ వేసి ఉపసంహరించుకున్న నాయకులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని అందరికీ న్యాయం చేస్తామని హా మీ ఇచ్చారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ లో మంత్రి శ్రీధర్ బాబు ను కలిసారు.

ఈ సందర్భంగా పలువురు మంత్రి శ్రీధర్ బాబుతో నాయకులు మాట్లాడుతూ కష్ట కాలంలో పార్టీ కోసం పని చేసినం మాకు పార్టీ టికెట్ రాకపోవడం బాధాకరమని అని అన్నారు. ఏదో విధంగా అందరికీ అవకాశం కల్పించి అందరికీ న్యాయం చేస్తామని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని మీమీ డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని పార్టీ అందరికీ న్యాయం చేస్తుందని శ్రీధర్ బాబు సూచించారు. ఈ సమావేశంలో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, వివిధ డివిజన్ల నాయకులు షబానా మహమ్మద్, కుదురత్ ఉన్నీసా బేగం, ఖంరోద్దీన్, చర్ల పద్మ, గడమల్ల శ్రీనివాస్, ముల్కల కవిత, అస్థాపురం రమేష్, యనమల మంజుల, జిడి రమేష్, ఉప్పరి అజయ్, గంగుల దిలీప్, సుదర్శన్, హనీఫ్, యోనా తదితరులు పాల్గొన్నారు.