15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తొలి అడుగు విజయవంతం

20-04-2025 12:52 AM
  1. వ్యాపార విస్తరణ దిశలో సింగరేణి
  2. సింగరేణి సీఎండీ ఎన్.బలరాం

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయ క్రాం ): సింగరేణి ఇతర రాష్ట్రాల విస్తరణలో తొలి అడుగుగా ఒడిశా రాష్ర్టంలో నైనీ బొగ్గు గని ని విజయవంతంగా ప్రారంభించామని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశా ల్లో మరిన్ని గనులు, ఇతర ఖనిజ ఉత్పత్తుల ను కూడా చేపట్టేందుకు సన్నద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

నైనీ బొగ్గు బ్లాకును ప్రారంభించిన సందర్భంగా శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో అధికారులు, ఉద్యోగు లు, కార్మిక సంఘాల నాయకులు బలరాం అభినందనలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.. నైనీ బొగ్గు గని ప్రారంభంతో సింగరేణి ఎక్కడైనా విస్తరించగలదన్న నమ్మకం ఏర్పడిందన్నారు.

నైనీ బొగ్గు బ్లాకు సాధన వెనుక సీఎం, డిప్యూటీ సీఎం చొరవతో పాటు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, ఒడిశా సీఎం, వివిధ శాఖల అధికారుల సహకారం ఉందన్నారు.

సింగరేణి సంస్థ ఇకపై ఖనిజాల ఉత్ప త్తి సంస్థగా కూడా ఎదగనున్నదని, థర్మల్ విద్యుత్తుతో పాటు, పునరుత్పాదక విద్యుత్తు రంగంలో కూడా విస్తరించనున్నదని తెలిపారు. సమావేశంలో ప్రాతినిధ్య కార్మిక సం ఘం సెక్రటరీ జనరల్, రాష్ర్ట కనీస వేతనాల కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్‌డీఎం సుభాని పాల్గొన్నారు.