calender_icon.png 4 May, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కంచ గచ్చిబౌలి’ వెనక ఉన్న ఎంపీ ఎవరో చెప్పరెందుకు?

20-04-2025 12:55:30 AM

  1. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత హెచ్‌సీయూ భూములపై కేంద్రం చర్యలు
  2. ఎంపీ రఘునందన్‌రావు ధ్వజం

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాం తి): హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో బీజేపీ ఎంపీ అంటూ ప్రచారం చేసిన కేటీఆర్ ఇప్పటివరకు ఆ ఎంపీ ఎవరో ఎందుకు చెప్పడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణలో బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని ఆరోపించారు. హెచ్‌సీయూ భూముల్లో పర్యావరణ పరిరక్షణకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచీ తాము ఈ భూముల రక్షణ కోసం పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీయే ఈ భూముల అంశాన్ని లేవనెత్తిన తర్వాత కూడా తమ ప్రధాని చిత్తశుద్ధిపై మాట్లాడటం చూస్తే కేటీఆర్ వ్యవహారం అర్థమవుతుందన్నారు. దీనిపై తాము కేంద్రమంత్రులకు సైతం ఫిర్యాదు చేశామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత హెచ్‌సీయూ భూములపై కేంద్రం చర్యలుంటాయని చెప్పారు.

111 జీవోను రద్దు చేసినప్పుడు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు పర్యావరణం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. నగరానికి లంగ్ స్పేస్‌గా ఉన్న 111 జీవో పరిధిలోని చెట్లను నరికేసి, నిర్మాణాలు చేపట్టినప్పుడు కేటీఆర్‌కు ప్రకృతి విధ్వంసం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ సర్కార్ అనుsమతించిన హైరైజ్ టవ ర్‌లో ఎక్కడ మొక్కలు నాటారు.. ఎన్ని చెట్లు పెంచారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ బీఆర్‌ఎస్ రెండు పార్టీలు దొందూ దొందే అన్న తీరుగా ఉన్నాయన్నారు. తాను రేవంత్ రెడ్డిని కాపాడుతున్న ట్టుగా కేటీఆర్ ఆరోపిస్తున్నాడని.. రేవంత్ సర్కార్ తప్పులే కాదు.. కేటీఆర్ చేసిన తప్పులనూ తాము ప్రశ్నిస్తామన్నారు. జైలుకు వెళ్తే భగవద్గీత చదువుతానని, యోగా చేస్తానని చెప్పిన కేటీఆర్, ఇప్పుడు నిజంగా జైలుకు వెళ్తే భగవద్గీత చదువుకోవచ్చని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు.