13 June, 2026 | 1:36 PM

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం

13-06-2026 12:21 PM
  1. హైదరాబాద్ లో భారీ వర్షాలు
  2. ప్రతికూల వాతావరణంతో 9 విమానాల దారి మళ్లింపు
  3. శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరణ 
  4. దారి మళ్లింపుతో ప్రయాణికుల ఇబ్బందులు

హైదరాబాద్: భారీ వర్షాలతో శంషాబాద్ విమానాశ్రయంలో(Shamshabad Airport) రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా 9 విమానాలను అధికారులు దారి మళ్లించారు. ముంబయి, ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, సింగపూర్ ప్రాంతాల నుంచి వచ్చే విమానాలపై ప్రభావం పడింది. శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కు అనుకూలంగా పరిస్థితులు లేవని అధికారులు తెలిపారు. కొన్ని విమానాలకు తాత్కాలికంగా అనుమతి లేదని ప్రకటించారు. విమానాలను దారి మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల విమానాశ్రయంలో వర్ష తుఫాను బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు, భారీ వర్షం కారణంగా టెర్మినల్ 2 వద్ద పార్క్ చేసి ఉన్న 3 ఎయిర్ ఇండియా విమానాలు దెబ్బతిన్నాయి.