సంగారెడ్డి జిల్లాలో ఆరు నెలల గర్భిణి ఆత్మహత్య
13-06-2026 02:12 PM
జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో(Zaheerabad mandal) ఆరు నెలల గర్భిణి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హోతీ (కె) గ్రామంలో జరిగింది. కుటుంబకలహాల కారణంగా మహిళ రెండో అంతస్తుపైనుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త, అత్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






