31-08-2025 06:28:11 PM
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా డోంగ్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం నుంచి టాక్లి, సిర్పూర్ గ్రామ వరద 150 మంది కుటుంబ సభ్యులు గత బుధవారం నుండి పునారవాస కేంద్రంలో ఉన్నారు. బాధితులను అధికారులు నాయకులు భోజన వసతి కల్పించారు. ఆదివారం వర్షం తగ్గుముఖం పట్టడంతో అధికారులు, నాయకులు వారి కుటుంబ సభ్యులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు వరద బాధితులను వారి స్వగ్రామానికి తరలించినట్లు తెలిపారు.