MBBS లో ఉచిత సీటు సాధించిన విద్యార్థిని

20-09-2026 | 03:35pm

బేల సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మండలంలోని చాందపల్లి గ్రామానికి చెందిన ఉత్తమ్ పవార్ కుమార్తె ఆచల్ పవార్ (Achal Pawar, daughter of Uttam Pawar) ఇటీవల జరిగిన ప్రవేశ పరీక్షలో MBBSలో ఉచిత సీటు సాధించిన సందర్భంగా బేల మరాఠా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బేల మరాఠా సంఘం అధ్యక్షుడు విట్టల్ రావుత్, దేవిదాస్ జక్తప్, ఆదానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, కుండలిక్ తదితరులు పాల్గొని ఆచల్ పవార్‌ను సత్కరించి అభినందించారు.

మరిన్ని వార్తలు