శ్రీ లక్ష్మి, భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
సుల్తానాబాద్ , జులై 3 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శ్రీ శీతలాదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా శుక్రవారం పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు దాసరి మనోహర్ రెడ్డి ని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ‘శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి అమ్మవారి కటాక్షం గ్రామ ప్రజలందరిపై, రైతాంగంపై, అలాగే పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, పాడి పంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో గర్రెపల్లి సింగల్ విండో చైర్మన్ సందీప్ రావు, బి ఆర్ ఎస్ నాయకులు బాయిని రాజమల్లు,సర్పంచ్ కర్రె గట్టయ్య, మాజీ సర్పంచ్ కోడెం అజయ్, నాయకులు పాల్గొన్నారు.






