30 June, 2026 | 10:15 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రోడ్డు ప్రమాదంలో మాజీ వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్ మృతి

19-03-2025 11:09 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి - కొత్తగూడెం హైవే రహదారిలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో టేకులపల్లి మండల పరిషత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఉండేటి ప్రసాద్ మృతి చెందారు. ప్రసాద్ తన సొంత గ్రామమైన సులానగర్ నుంచి కొత్తగూడెంకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎదురుగ వస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు వేగంగా వచ్చి సీతారాంపురం సమీపంలో ఢీ కొట్టాడు. రోడ్డుపై పడిపోయిన ప్రసాద్ కు తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ద్విచక్ర వాహనదారుడి వివరాలు తెలియాల్సి ఉండగా అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. టేకులపల్లి ఎస్సై పోగుల సురేష్ సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.