17 July, 2026 | 11:55 AM

రేపు ​మాడుగులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

17-07-2026 11:55 AM

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి 

​మాడుగుల, జులై 17(విజయక్రాంతి): ఈ నెల 19వ తేదీన మాడుగుల మండలంలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayana Reddy) విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.3.82 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు ఏఎంసి డైరెక్టర్ సంపత్ కుమార్ తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.  ​ఎమ్మెల్యే పర్యటన వివరాలు: ​కొలుకులపల్లి (ఉదయం 9:00): సాగర్ హైవే వద్ద హైమాస్ట్ లైట్లు, బస్ షెల్టర్ ప్రారంభోత్సవం, రూ.30 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన,ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం.  ​రాజీవ్‌నగర్ తండా రూ.5 లక్షల వ్యయంతో హైమాస్ట్ లైట్ ప్రారంభోత్సవం,ఎన్‌ఆర్‌ఈజీఎస్ సీసీ రోడ్డు పనుల శంకుస్థాపన,​నర్సాయిపల్లి (ఉదయం 10:30): రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవం; రూ.50 లక్షలతో సీసీ రోడ్డు పనుల శంకుస్థాపన.  

​మాడుగుల గ్రామం (ఉదయం 11:50): రూ.31 లక్షల వ్యయంతో నిర్మించిన విజయ డెయిరీ బీఎంసీ నూతన యూనిట్ ప్రారంభోత్సవం; రూ.2 కోట్లతో నూతన గ్రంథాలయ భవన శంకుస్థాపన; రూ.9.50 లక్షలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవన ప్రారంభోత్సవం.  అక్కడి నుంచి అప్పారెడ్డిపల్లి, ఆర్కపల్లి, పలుగు తండాలలో రూ.30 లక్షల చొప్పున.. కాశగూడెంలో రూ.50 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన, రూ.20 లక్షల జీపీ భవన ప్రారంభోత్సవం. చంద్రాయిన్‌పల్లిలో రూ.25 లక్షల సీసీ రోడ్డు పనుల శంకుస్థాపనతో పర్యటన ముగుస్తుంది.  ​మాడుగుల మండల అభివృద్ధే ధ్యేయంగా సాగనున్న ఈ పర్యటనను విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సంపత్ కుమార్ పిలుపునిచ్చారు.