ఆర్టీసీ బస్సు ప్రమాదం
లారీని వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు..
హైడ్రా సాయంతో డ్రైవర్‌ను బయటకు తీసిన సిబ్బంది
కొండపాక, జులై 17: కొండపాక మండలం దుద్దెడ టోల్‌గేట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కరీంనగర్‌కు చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను హైడ్రా సహాయంతో బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌కు గాయాలైనప్పటికీ, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.






