ఉచిత ఆయుర్వేదిక్ వైద్య శిబిరం

28-09-2026 | 12:03pm

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),సెప్టెంబర్ 27:  మండల పరిధిలోని కాసర్లపహాడ్ గ్రామంలో స్వేరో నెట్వర్క్ ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో మచ్చ వెంకటమ్మ, గడ్డం మల్లయ్యల జ్ఞాపకార్థం ఉచిత ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంపు(Ayurvedic Medical Camp)ను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం ఆయుర్వేదిక్ డాక్టర్ పీసీ వీరస్వామి హాజరై మాట్లాడుతూ ప్రకృతి వైద్యం, ఆయుర్వేదిక్, ఆక్యుపంచర్ వైద్యం ద్వారా మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పులు,థైరాయిడ్, షుగర్, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధులను తక్కువ ఖర్చుతో నయం చేసుకోవచ్చని తెలిపారు.

ప్రజలు ఇంగ్లీష్ మందులకు అలవాటు పడకుండా ప్రకృతి వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మచ్చ నర్సయ్య మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరానికి 100 మంది హాజరయ్యారని,60 మందికి ట్రీట్మెంట్ అందించామని తెలిపారు.గ్రామంలో వైద్య శిబిరం(Medical Camp) ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ముత్యాలు, నర్సయ్య, మల్లయ్య, కృష్ణయ్య, పూలమ్మ, వెంకటమ్మ, లచ్చమ్మ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు