19-02-2026 02:33:16 AM
ట్రస్టు చైర్మన్, బీఆర్‌ఎస్ నేత జక్కిడి రఘువీర్‌రెడ్డి
ఎల్బీనగర్, ఫిబ్రవరి 18 : మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మన్సూరాబాద్ డివిజన్ ప్రగతి నగర్ కాలనీలో బీఆర్‌ఎస్ నాయకుడు, జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జక్కిడి రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వ హించి, ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదర్శ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో కంటి వెలుగు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జక్కిడి రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో మందికి ఉపయోగపడిన కంటి వెలుగు కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందన్నారు. కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లా రెడ్డి, మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీశ్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రి వెంకన్న, ఆదర్శ సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.