calender_icon.png 19 February, 2026 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిలకలగూడ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా ఒలిశెట్టి రామకృష్ణ

19-02-2026 02:28:35 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి18 (విజయ క్రాంతి): చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఒలిశెట్టి రామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రామకృష్ణ 2002 బ్యాచ్కు చెందిన పోలీసు అధికారి. గతంలో ఎస్బీ స్పెషల్ బ్రాంచ్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయ న, తాజాగా బదిలీపై చిలకలగూడ పోలీస్ స్టేషన్కు వచ్చి ఎస్హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్హెచ్‌ఓ రామకృష్ణ మాట్లాడుతూ, స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తా మని స్పష్టం చేశారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అసాంఘిక శక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి, నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కొరకు మీడియా వారు సైతం తమ సహాయ సహకారాలను అందించాలని కోరారు. ప్రజల సహకారంతో సమర్థవంతమైన పోలీసింగ్ను అమలు చేసి, చిలకలగూడ ప్రాంతా న్ని శాంతియుతంగా,నేరరహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రామకృష్ణ పేర్కొన్నారు.