8 July, 2026 | 2:44 PM

మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ తరగతులు

08-07-2026 02:03 PM

జగదేవపూర్ (విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిదిలోని బి.జి వెంకటాపూర్ గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), RSETI యూనియన్ బ్యాంక్,మారి స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులను జిల్లా డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య, గ్రామ సర్పంచ్ పరమేశ్వర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ కాళ్లపై తాము నిలబడాలని, కుటుంబానికి చేదోడు–వాదోడుగా నిలిచి ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ గేము నాయక్, కోఆర్డినేటర్ మొహమ్మద్ నజీమ్ అలీ, ఏపిఎం నర్సయ్య, ఇ సీ సుధాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొద్దు నాయక్, ఉపసర్పంచ్ బాబు, వార్డు సభ్యులు, జీపీవో మారి సంస్థ ప్రతినిధులు,గ్రామ ప్రజలు,మహిళలు  పాల్గొన్నారు.