calender_icon.png 7 June, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన యువతకు సోలార్ ఫోటోగ్రఫీపై ఉచిత శిక్షణ: ఐటీడీఏ పీవో రాహుల్

06-06-2025 06:47:50 PM

భద్రాచలం,(విజయక్రాంతి): సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, భద్రాచలం వారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో గల గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు సోలార్ ప్యానల్ టెక్నీషియన్, ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ ,హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ ఉపాధి/స్వయం ఉపాధి కోర్సులకు ఒక నెల నుంచి 2 నెలల పాటు ఉచిత శిక్షణ కల్పించుటకు దరఖాస్తులు కోరుచున్నట్లు  ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కావున పదవ తరగతి ,ఆ పైన చదువుకున్న గిరిజన యువతి, యువకులు శిక్షణ కోసం కులం, ఆధార్ కార్డు, పాస్ ఫోటో, స్టడీ పత్రాలను (హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసం లైట్ మోటార్ వెహికల్ లైసెన్సు & బ్యాడ్జి నెంబర్ తప్పనిసరి) తీసుకొని ఈనెల 13వ తేదీ ఉదయం 9 గంటలకు ఐటీడీఏ భద్రాచలం ప్రాంగణంలో గల యూత్ ట్రైనింగ్ సెంటర్ నందు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరుతూ ఇతర వివరముల కొరకు 8143840906, 6302608905 ఫోన్ సంప్రదించాలని ఆయన కోరారు.