3 July, 2026 | 3:24 PM

అలుపెరుగని ఉద్యమ నేత ఏనుగు

03-07-2026 02:32 PM

చొప్పదండి:(విజయక్రాంతి): తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి, యువతరానికి ఆదర్శంగా నిలిచిన యువ నేత మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, రామగుండం నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని శుక్రవారం చొప్పదండి నియోజకవర్గ కేంద్రం లో బి ఆర్ ఎస్ నేతలు, మండల బి ఆర్ ఎస్ అధ్యక్షులు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షులు బత్తిని సంపత్ ల ఆధ్వర్యం లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రవీందర్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపి చిలుక రవీందర్, మాజీ మార్కెట్ చైర్మన్ అరెల్లి చంద్రశేఖర్, సర్పంచ్ బందారపు అజయ్ కుమార్, కౌన్సిలర్ కొత్త సుమలత గంగారెడ్డి, మాజీ సర్పంచ్ వెల్మ నాగిరెడ్డి, మాజీ కౌన్సిలర్ లు మాడూరి శ్రీనివాస్, నలుమాచు రామకృష్ణ, కొత్తూరి మహేష్, సీపెల్లి గంగయ్య, బీసవేని రాజశేఖర్, గాండ్ల లక్మణ్, ఎం డి జహీర్, ఎం డి అజ్జు, వెల్మ స్వామి రెడ్డి, వడ్లకొండ శ్రీనివాస్, పెద్దేలి అనిల్, నరేష్ రావణ్, అనుమల్ల రమేష్, అనుమల్ల నాగరాజు, బైర కన్నా, సాయి తదితరులు పాల్గొన్నారు.