హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురుతుంది
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్ రావు
హుజూరాబాద్,జూన్6: (విజయక్రాంతి): రానున్న హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో(Huzurabad Municipal Elections) బీజేపీ(BJP) జెండా ఎగురుతుందని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని శిశుమందిర్‌లో పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో శుక్రవారంనిర్వహించిన వర్క్‌షాప్‌లో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు(BJP District Vice President Errabelli Sampath Rao) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ.. 11 ఏళ్ల మోదీ పాలన విజయాలు, పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై పార్టీ తీర్మానాలు ప్రవేశపెట్టారు.
జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి కౌంటర్‌గా భారత బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’(Operation Sindoor) విజయాన్ని ప్రశంసిస్తూ, మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై క్షిపణి దాడులు, సిందూ జలాల ఒప్పందం రద్దు వంటి విషయాలను హైలైట్ చేశారు. పట్టణంలోని మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీలు, రోడ్ల దుస్థితి, కోతుల బీభత్సం, ట్రాఫిక్ సమస్యలు వంటి ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ తీర్మానాలు చేశారు. రేషన్ షాపుల వద్ద మోదీ ఫోటో తప్పనిసరిగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, రావుల వేణు, గంగిశెట్టి రాజు, పైల వెంకట్ రెడ్డి, నల్ల సుమన్, కొలిపాక వెంకటేష్, నరాల రాజశేఖర్, మల్లెల సరితతో పాటు తదితరులు పాల్గొన్నారు.






