పంజాబ్ వర్సిటీలో గ్యాంగ్ రేప్?

28-09-2026 | 05:20am
  1. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు వదంతులు
  2. అర్ధరాత్రి 2వేల మంది విద్యార్థుల ఆందోళన
  3. ఎల్పీయూలో తెలంగాణ విద్యార్థిని సూసైడ్:డీఐజీ

ఫగ్వారా, సెప్టెంబర్ 27: పంజాబ్‌లోని ఎల్పీయూలో (LPU in Punjab)ఓ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, ఆ తర్వాత ఆమె ఆత్మహత్య(Suicide) చేసుకున్నట్లు వార్తలు రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి సుమారు 2 వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లో కిటి కీలు, ఇతర సామగ్రిని విద్యార్థులు ధ్వంసం చేశారు. మరి కొన్ని వస్తువులకు నిప్పు పెట్టారు. అనంతరం జలంధర్ నేషనల్ హైవే నూ దిగ్బంధించారు. అయితే అత్యాచార ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని, ఇప్పటివరకు ఆధారాలు కూడా లభించలేదని పోలీసులు తెలిపారు.

యూనివర్సిటీ కూడా ఈ ప్రచారం అంతా తప్పు అంటూ.. వందుతులను ఖండించింది. అయితే తెలంగాణకు చెందిన ఓ విద్యార్థిని 15 రోజుల క్రితం సూసైడ్ చేసుకుందని, కానీ రేప్‌ఘటనకు, ఈమెకు ఎటువంటి ఆధాలు దొరకలేదని డీఐజీ తెలిపారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ వదంతులలో ఏమా త్రం నిజం లేదని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఒక ప్రకటనలో తెలిపింది.

పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక విద్యార్థినిపై కొందరు సామూహిక అత్యాచారం చేశారన్న వదంతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యా యి. దీంతో సుమారు 2వేల మంది విద్యార్థులు ఎల్పీయూ కిటికీ అద్దాలను, మట్టి పూల కుండీలను పగలగొట్టారు. కొన్ని వస్తువులకు నిప్పు పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం వరకు హైవేపై దిగ్బంధం కొనసాగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. విద్యార్థుల వాంగ్మూలం ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు, సిట్‌ను  ఏర్పాటు చేశామని, విద్యార్థుల ప్రతినిధులతో కలిసి దర్యాప్తు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఎల్‌పీయూలో తెలంగాణకు చెందిన ఒక విద్యార్థిని 15 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుం దని డీఐజీ నవీన్ సింగ్లా తెలిపారు. 

మరిన్ని వార్తలు