17 May, 2026 | 10:22 PM

బాపు లాంటి జానర్స్ చాలా అరుదు

14-02-2025 12:00 AM

బ్రహ్మాజీ, ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘బాపు’. ఈ డార్క్ కామెడీ -డ్రామాలో బలగం సుధాకర్‌రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవ సరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహిస్తున్నారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రాజు, సీహెచ్ భాను ప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. హీరో రానా దగ్గుబాటి, తిరువీర్ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ట్రైల ర్ లాంచ్ ఈవెంట్‌లో రానా మాట్లాడుతూ.. ‘రెగ్యులర్‌కి భిన్నంగా ఇలాంటి జానర్స్ రావడం చాలా అరుదు. ఒక కల్చర్‌ని చూపించే జానర్ ఎక్సయిటిం గ్‌గా ఉంది’ అన్నారు. ‘బాపు టైటిల్ పెట్టగానే నచ్చేసింది.

ఇందులో ప్రమోషనల్ కంటెంట్ నా బాల్యానికి తీసుకెళ్లింది. బ్రహ్మాజీ గారిని ఇలాంటి పాత్రల్లో చూస్తే కడుపునిండిపోయింది’ అని తిరువీర్ అన్నారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ‘బాపు మంచి కంటెంట్ ఉన్న సినిమా. అందరూ కలసి మంచి ప్రయత్నం చేశాం’ అన్నారు. డైరెక్టర్ దయ మాట్లాడుతూ.. ‘మా నిర్మా తలు, నటీనటులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా 21న వస్తోంది. అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నా’ అన్నారు.