1 August, 2026 | 6:56 PM

Breaking News

కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ   •   ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ   •   ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ   •   చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ   •   నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం   •   పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా   •   గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం   •   ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   వికలాంగులకు అన్నదానం చేసిన తాటిపల్లి భూపతి   •  

రా రా రాక్షస..

14-02-2025 12:00 AM

కన్నడ స్టార్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాక్షస’. ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుం ది. ఒరిజినల్ వెర్షన్ కన్నడతోపాటు తెలుగులోనూ అదేరోజు విడుదలవుతోంది. ఈ చిత్రం నుంచి గురువారం టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సినిమా కాన్సెప్ట్‌ను తెలియజేసేలా సాగిన ఈ పాట అందర్నీ ఆకట్టుకుం టోంది.

‘మాయలో మాయకి చిక్కినాక.. దారిలో కానరాక చొచ్చుకెళ్లాక.. రూపమే అదృశ్యం అయ్యాక.. నా నీడే వెచ్చగా తగిలాక.. వెళ్లే దారిలో.. తిరిగే సుడిగుండంలా మొత్తం అంతా మాయే.. కలయో నిజమో అసలేమీ తెలియదే.. భయంతో గట్టిగా పిలిచే నువ్వెవరే.. రా రా రాక్షస’ అంటూ సాగిన పాటకు ప్రేమ్ బీఎస్ లిరిక్స్‌ను అందించగా, సాయిచరణ్  గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.