అక్రమ లేఅవుట్‌పై కొరడా

02-10-2026 | 05:10am
  1. గంధంగూడలో అనుమతుల్లేని వెంచర్‌పై జీహెచ్‌ఎంసీ చర్యలు
  2. ఫిర్యాదుల తర్వాతే కదిలిన అధికార యంత్రాంగం.. 
  3. డిప్యూటీ కమిషనర్ తీరుపై అవినీతి ఆరోపణలు

రాజేంద్రనగర్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు(GHMC officials) ఎట్టకేలకు కొరడా ఝళిపించారు. రాజేంద్రనగర్(Rajendranagar) సర్కిల్-19 పరిధిలోని గంధంగూడలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అనధికారిక లేఅవ్పు గురువారం అధికారులు చర్యలు చేపట్టారు.

స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది అక్కడికి చేరుకుని అక్రమంగా నిర్మిస్తున్న భ వనాన్ని కూల్చివేశారు.అయితే సర్కిల్ పరిధి లో అనుమతులు లేకుండా నిర్మాణాలు, లే అవుట్లు వెలుస్తున్నా అధికారులు ముందస్తు గా ఎందుకు గుర్తించలేకపోతున్నారన్న ప్రశ్న లు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ఫిర్యా దు అందిన తర్వాతే అధికారులు రంగంలోకి దిగుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

డిప్యూటీ కమిషనర్‌పై ఆరోపణలు.. విచారణకు డిమాండ్

రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పనితీరుపై అవినీతి ఆరోపణలు వెల్లువె త్తుతున్న నేపథ్యంలో.. వాటిపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ లేఅవుట్లు, నిర్మాణాల విషయంలో అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందన్నది తే లాల్సి ఉందని పేర్కొంటున్నారు. అయితే ఆరోపణలకు సంబంధించి అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

అనుమతులు లేకుం డా లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు, నిర్మాణాలు జరుగుతున్నాయా? వాటిని పర్యవేక్షించాల్సిన విభాగాల బాధ్యత ఏమిటన్న అంశా లపై కూడా విచారణ అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దళారుల మాటలు నమ్మొద్దు

‘పర్మిషన్లు ఇప్పిస్తాం.. అధికారులతో మా ట్లాడి పని పూర్తి చేయిస్తాం’ అంటూ తిరిగే దళారులు, మధ్యవర్తుల మాటలను నమ్మొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించా రు. దళారీ వ్యవస్థను సహించబోమని స్పష్టం చేశారు.

అనుమతుల తర్వాతే నిర్మాణాలు

ఇల్లు లేదా ఇతర నిర్మాణాలు చేపట్టాలనుకునే వారు ‘బిల్ నౌ’ వంటి అధికారిక ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని అ ధికారులు సూచించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో వివరాలు తెలుసుకుని, ని బంధనల ప్రకారం అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని కోరారు. అనుమతులు లేని లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోవద్దని, చట్టబద్ధమైన అనుమతులు ఉన్న లేఅవుట్లలోనే స్థలాలు కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు.


మరిన్ని వార్తలు