గీతంలో జాతీయ ఫార్మసీ వారోత్సవాలు
పటాన్ చెరు, అక్టోబర్ 1: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో(GITAM School of Pharmacy) గురువారం ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం, జాతీయ ఫార్మసీ వారోత్సవాలు-2026ను ఘనంగా జరుపుకున్నారు. సూక్మజీవి నాశిని నిరోధకత (ఏఎంఆర్) అవగాహనా కార్యక్రమంలో భాగంగా, ‘యాంటీమైక్రోబయల్ నిరోధకతను ఎదుర్కోవడం’ అనే ఇతివృత్తంతో వీటిని నిర్వహించారు.
ఎంతో ఉపయుక్తంగా, అర్థవంతంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం పట్ల ఇందులో పాల్గొన్న విద్యార్థులు హర్షాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమాలు తమ సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, వృత్తిపరమైన నైపుణ్యాలు, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అనే క్లిష్టమైన సవాలుపై అవగాహనను పెంచాయని వారు అభిప్రాయపడ్డారు.
రుద్రారం ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా కార్యక్రమం
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్.సి.సి. క్యాడెట్లు, సిబ్బంది 2026 అక్టోబరు 1న (గురువారం) రుద్రారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్)లో ‘ఒక గంట, అంతా కలిసి’ అనే సామూహిక పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సుస్థిరమైన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యత గురించి పాఠశాల విద్యార్థులు, స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పరిశుభ్రత, పౌర బాధ్యత, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.