7 April, 2026 | 3:26 PM

Breaking News

రేపే ఎన్ఎస్ఎస్ రాష్ట్ర స్థాయి సెమినార్   •   అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కోవ లక్ష్మి   •   ప్రజలు మధ్యవర్తులను నమ్మవద్దు   •   కన్నాలలో బాలామృతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గుడిసె గట్టయ్య   •   కేంద్రం కీలక నిర్ణయం.. 5 కిలోల గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •   హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు   •   పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులే రాజులు   •  

జెన్‌జీ లవ్‌స్టోరీ.. ఏమో ఏమో ఇది

15-02-2026 01:32 AM

ఇటీవల ‘ఛాంపియన్’తో ప్రేక్షకుల ముందుకువచ్చిన రోషన్ మేకా ఓ రొమాంటిక్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. ఇందులో ఆయన సరసన హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్ నటిస్తోంది. ఈ చిత్రానికి ‘ఏమో ఏమో ఇది’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా టైటిల్‌తోపాటు గ్లింప్స్‌ను ఆవిష్కరించారు మేకర్స్. ఈ వీడియోలో నవతరం ప్రేమబంధాలు, ఆధునిక వివాహాలు వంటి అంశాలను వినోదా త్మకంగా చూపించారు.

ఈ చిత్రంలో రోషన్ మేకా ఇందులో అభయ్ పాత్రలో కనిపిస్తూ, జెన్‌జీ తరం ప్రేమను ఆవిష్కరించే పక్కింటి అబ్బాయిగా మెప్పించనున్నట్టు తెలుస్తోంది. ఇక అపూర్వ పాత్రలో ప్రీతి ముకుందన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడానికి సిద్ధమవుతోంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనున్న ఈ సినిమాను వచ్చే దసరాకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హేషామ్ అబ్దుల్ వహాబ్; ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు.