7 April, 2026 | 5:12 PM

Breaking News

ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిలువెత్తు దండతో ఘనంగా సన్మానం   •   చంద్ర మహంకాళి ఆలయంలో పూజలు   •   గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక   •   పేదల స్వంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం: ధరావత్ వీరన్న నాయక్   •   'టచ్ చేసి చూడు.. పాకిస్థాన్‌ ముక్కలే'! పాక్‌కు భారత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌   •   గిరిజన గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం నిర్వహణ   •   రసాయనాల నియంత్రణతో క్యాన్సర్ నివారణ   •   ఘనంగా జీవీఆర్ జన్మదిన వేడుకలు   •   పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్   •   ఐఎన్టీయుసీ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎస్కే బాజీ సాహెబ్   •  

క్వీన్ ప్రేమకథ.. కొత్త శాసనం!

15-02-2026 01:30 AM

ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ యామినీ ఈఆర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు యంగ్ డైరెక్టర్ రతన్ రిషి. గతంలో ‘ఉత్తర’, ‘ఆర్టిస్ట్’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం మూడో చిత్రంగా హీరోయిన్ సెంట్రిక్ కథను చెప్పబోతున్నారు. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్లుగా నటిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.

‘క్వీన్‘ అనే టైటిల్‌తో రానున్న ఈ సినిమా గ్లింప్స్.. ప్రస్తుత సమాజంతో ముడిపడి ఉన్న ఒక ఆసక్తికరమైన ప్రేమకథను ఆవిష్కరించింది. ‘రాళ్లమీద పేర్లతో కొన్ని ప్రేమకథలు మిగిలిపోతాయి. తాజ్‌మహల్ మీద గుర్తులుగా మరికొన్ని ప్రేమకథలు మిగిలిపోతాయి. కానీ దేశపు మనుగడను మార్చే కొత్త శాసనంగా ఈ ప్రేమకథ’ అంటూ సాగే గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ప్రస్తుతం  షూటింగ్ జరుపుకుం టున్న ఈ సినిమాకు సంగీతం: యతీశ్; డీవోపీ: సరస్; ఆర్ట్: భార్గవ నౌండ్ల; ఎడిటింగ్: ఆర్‌ఎం విశ్వనాథ్ కుచనాపల్లి.