12 March, 2026 | 9:28 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ఆమిర్‌ఖాన్ కొడుకుతో..

15-02-2026 01:34 AM

వయసులో తనకంటే చిన్నవాడితో రొమాన్స్‌కు సిద్ధమయ్యింది అందాల చందమామ తమన్నా. అదిరిపోయే సెప్పులు, తనదైన నటనతో అందరినీ అలరించే ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. అలా ఇప్పుడు తన జాబితాలోకి మరో ప్రాజెక్టు చేరినట్టు తెలుస్తోంది. త్వరలో ‘రాగిణి 3’ సినిమా వస్తోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్‌ఖాన్‌కు జంటగా తమన్నా నటిస్తున్నట్టు సమాచారం.  శశాంక్ గోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కలయికతో ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ జోడి పరిచయం కాబోతోందని బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. వ్యక్తా కపూర్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇకపోతే తమన్నా, జునైద్‌ఖాన్ జంటగా నటించబోతున్నారని వార్తలు వస్తున్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఇప్పుడు చర్చకు దారితీసింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తమన్నా వయసు 36 కాగా, జునైద్‌ఖాన్ 32 ఏళ్ల వయస్కుడు. అయితే ఇద్దరి మధ్య నాలుగు సంవత్సరాల వయసు తేడా ఉండడం గమనార్హం. మరి ఇద్దరూ తెరపై ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి. ఇక జునైద్‌ఖాన్ సాయిపల్లవితో కలిసి ‘ఏక్ దిన్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా 2026 మే 1న విడుదల కాబోతోంది. సునీల్ పాండే దర్శకత్వం వహించారు.