బంగారం రేటు దిగొచ్చింది
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు(Gold Rate Hyderabad Today) స్వల్పంగా తగ్గాయి. వరుసగా ధరల కదలికను గమనిస్తున్న పసిడి ప్రియులకు తాజా మార్పు కొంత ఆసక్తిని కలిగిస్తోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల(24 Carat Gold Rate) 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గి రూ.1,52,680కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.1,39,950 వద్ద నమోదైంది. మరోవైపు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. కిలో వెండి(Silver Rate Hyderabad) రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది. అంటే బంగారం ధరలు కాస్త దిగివచ్చినా.. వెండి మాత్రం అదే స్థాయిలో నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో స్థానిక బులియన్ మార్కెట్(Bullion Market) పరిస్థితులు, డిమాండ్, సరఫరా తదితర అంశాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు. అలాగే నగలు కొనుగోలు చేసేటప్పుడు బంగారం ధరకు 3 శాతం GST అదనంగా వర్తిస్తుంది. దీనికి తోడు మేకింగ్ ఛార్జీలు కూడా ఉండటంతో తుది బిల్లు మరింత మారవచ్చు. బంగారం కొనాలని చూస్తున్నవారు కేవలం ఒకరోజు ధరను మాత్రమే కాకుండా.. గత కొన్ని రోజుల ట్రెండ్‌ను కూడా గమనించడం ఉపయోగకరం.