చివరి నిమిషాల్లో ట్విస్ట్.. భారత్‌కు స్వర్ణం!
చివరి వరకు ఉత్కంఠ.. ఇరాన్‌ను ఓడించి భారత మహిళల కబడ్డీ జట్టుకు స్వర్ణం!
నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో(Asian Games 2026 Gold Medal) భారత మహిళల కబడ్డీ జట్టు(India Women Kabaddi) మరోసారి సత్తా చాటింది. శనివారం జరిగిన ఫైనల్లో ఇరాన్‌తో(India vs Iran Kabaddi) హోరాహోరీగా తలపడిన భారత జట్టు 37-34 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆట ప్రారంభం నుంచే భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 22-16 ఆధిక్యంలో నిలిచింది. అయితే విరామం తర్వాత ఇరాన్ ఒక్కసారిగా పుంజుకోవడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. ఒక దశలో ఆధిక్యం కూడా ప్రమాదంలో పడినప్పటికీ.. కీలక సమయంలో భారత కబడ్డీ జట్టు పుంజుకుని విజయాన్ని ఖాయం చేశారు.
చివరి విజిల్ మోగగానే భారత శిబిరంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆటగాళ్లు స్టేడియంలో విజయయాత్ర చేస్తూ ‘వందే మాతరం’ ఆలపించారు. మరోసారి ఆసియా వేదికపై భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణంతో(Asian Games Kabaddi) మెరిసింది. ఈ విజయం భారత మహిళల కబడ్డీ జట్టు ఆసియా క్రీడల్లో తమ బలమైన రికార్డును కొనసాగించిన మరో ఘట్టంగా నిలిచింది. 2026 ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీ ఫైనల్‌కు ముందు భారత్ వరుస విజయాలతో ముందుకు సాగింది.