తాడిచెట్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలి
01-10-2026 | 07:48pm
ఎమ్మెల్యే గండ్రను కలిసిన గౌడ సంఘం నేతలు
భూపాలపల్లి రూరల్,(విజయక్రాంతి): కోడెపాక గ్రామ శివారు బాలయ్యపల్లిలో విద్యుత్ లైన్ పనుల కోసం గౌడ కుల వృత్తికి ఆధారమైన తాడిచెట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని గౌడ సంఘం(Gouda Sangham) నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyanarayana Rao)ను కలిసి విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ అధికారులు, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు తాడిచెట్లు తొలగించకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో గౌడ సంఘం చైర్మన్ కక్కెర్ల సంపత్ గౌడ్, అధ్యక్షులు కొత్తకొండ భానుతేజ గౌడ్, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షులు గట్టు ప్రదీప్ గౌడ్, కునూరి రాజేష్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ఉన్నారు.