గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

09-09-2026 | 08:39am

బేల, సెప్టెంబర్ 09 (విజయక్రాంతి): గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad District) చోటు చేసుకుంది. బేల మండలం సోన్ కాస్ గ్రామానికి చెందిన గురునులే సతీష్ మండలంలోని ఖోగదూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా(Government Teacher) విధులు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ లో నివాసం ఉంటున్న ఆయనకు గతరాత్రి ఆకస్మికంగా గుండెపోటు రావడంతో కుటుంబీకులు రిమ్స్ కు తరలించగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సతీష్ మృతి పట్ల తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మరిన్ని వార్తలు