26 August, 2026 | 4:43 PM

సీఐ నరేష్‌కుమార్‌కు గౌడ సంఘం నాయకుల వీడ్కోలు

26-08-2026 04:09 PM

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 26(విజయ క్రాంతి): భూపాలపల్లి సీఐ నరేష్‌కుమార్ గౌడ్ బదిలీపై ఏసీబీ విభాగానికి వెళ్తున్న సందర్భంగా గౌడ సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నరేష్‌కుమార్ గౌడ్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కంకటి రాజవీరు గౌడ్, తాటి అశోక్ గౌడ్, ముత్యాల రాజబాబు గౌడ్, కోల తిరుపతి గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కేవీ అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.