కలెక్టరేట్ ఎదుట జిపి వర్కర్ల ధర్నా
28-09-2026 | 07:40pm
నిర్మల్ సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్(CITU) ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని కోరారు. ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో ఇంచార్జి అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. జిపి వర్కర్లు ఉన్నారు.