అరిస్టాటిల్ పీజీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే
134 మంది ఎంబీఏ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): మొయినాబాద్‌లోని అరిస్టాటిల్ పీ జీ కాలేజ్(Aristotle PG College), స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో 22వ గ్రాడ్యుయేషన్ డే ఆదివారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఎంబీఏ పూర్తి చేసిన 134 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చే శారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మం డలి మాజీ వైస్-చైర్మన్ ప్రొఫెసర్ కె. వెంకటాచలం ముఖ్య అతిథిగా, జేఎన్‌టీయూ- హైదరాబాద్ మాజీ వైస్ -చాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి గౌరవ అతిథిగా హా జరయ్యారు.
కళాశాల ప్రిన్సిపాల్ లయన్ ప్రొఫెసర్ ఎల్. శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రతిభ కనబరిచిన శృతి, అస్మా ఫాతిమాలకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఇతర ప్రతిభావంతులైన వి ద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రా లు ప్రదానం చేశారు. ప్రొఫెసర్ వెంకటాచలం మాట్లాడుతూ డిగ్రీ పొందడం విద్యకు ముగింపు కాదని, జీవితాంతం కొనసాగించే అభ్యాసానికి నాంది అని అన్నారు.