కారులో 87 గ్రాముల ఆల్ఫాజోలం స్వాధీనం
20-09-2026 | 10:14pm
-ఒకరి అరెస్టు.. కారు యజమాని పరారీ
కొండపాక, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): కుకునూరుపల్లి మండలం నుంచి తిప్పారం వెళ్లే రహదారిపై మత్తు పదార్థాల(Narcotic Substances) అక్రమ రవాణా జరుగుతున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారంతో చేర్యాల ఎక్సైజ్ శాఖ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన కారును తనిఖీ చేయగా, అందులో 87 గ్రాముల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ పి. నరసింహులు తెలిపారు. ఈ కేసులో బుర్ర కృష్ణ (47)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. కారు యజమాని బుర్ర రాజు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. మత్తు పదార్థాలను కలిగి ఉన్నా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.