సెయింట్ మేరీస్ పాఠశాలలో ఘనంగా తాతమ్మల దినోత్సవం..
హెచ్ఎం నిర్మల పోలిశెట్టి
కొత్తగూడెం సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెంలోని సెయింట్ మేరీస్ బాలికల ఉన్నత పాఠశాల(St. Mary's School)లో సోమవారం రోజున, తాతమ్మల దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థుల తాతమ్మలను ఉపాధ్యాయులు సాధారంగా ఆహ్వానించారు. విద్యార్థులు, తాతమ్మలతో పాఠశాల ఆనందోత్సలతో కన్నుల పండుగగా జరిగింది. ముఖ్య అతిథులుగా, కరెస్పాండంట్ మేరీ జోహాన్, ప్రధాన ఉపాధ్యాయురాలు నిర్మల పోలిశెట్టి, అసిస్టెంట్ హెచ్ఎం, వైస్ మాధవి పాల్గొని ప్రసంగించారు.
తాతమ్మ నానమ్మలు ఉండటం ఒక గొప్ప వరం.వారు మన సంపద అనీ కొనియాడారు.అనంతరం చిన్నారుల ఆటపాటలతో అందరినీ అలరించారు. 76 వసంతాలు పూర్తి చేసుకున్న సెయింట్ మేరీస్ పాఠశాలలో మొట్టమొదటిసారిగా తాతమ్మల దినోత్సవం జరుపుకోవడం గర్వంగా ఉందని పాఠశాల యాజమాన్యం తెలియజేశారు. జిల్లాలోనే మొట్టమొదట తాత మన దినోత్సవాన్ని,జరుపుకున్న ఏకైక పాఠశాలగా చరిత్రలో నిలిచిపోనుంది. అనంతరం విద్యార్థుల తాతమ్మలు వారి వారి అనుభవాలను పంచుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల యాజమాన్యం పలువురు తాతమ్మ నానమ్మలను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.