17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు

15-04-2026 01:24 PM

దమ్మపేట,(విజయక్రాంతి): గత తొమ్మిది సంవత్సరాలుగా ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న భీమ్ జీ ఖమ్మం జిల్లా కోర్టుకు బదిలీ కావడంతో దమ్మపేట బార్ అసోసియేషన్ భీమ్ జీ ని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దమ్మపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గొంది మురళీమోహన్ మాట్లాడుతూ భీమ్ జీ సుదీర్ఘ కాలంగా అశ్వారావుపేట ఎక్సైజ్ స్టేషన్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.