రాజేందర్‌కు ఘన సన్మానం
అంబేద్కర్ యువజన సంఘం నేత రాజేందర్‌కు ఘన సన్మానం
50వ స్వర్ణోత్సవాల్లో ప్రశంసాపత్రం అందజేత
గణపురం, సెప్టెంబర్ 28 (విజయ క్రాంతి): అంబేద్కర్(Ambedkar) యువజన సంఘం 50వ స్వర్ణోత్సవాల సందర్భంగా సంఘంలో ఉత్తమ సేవలందించిన గణపురం మండల అధ్యక్షుడు, అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత శనిగరపు రాజేందర్‌ను ఘనంగా సన్మానించారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం జరిగిన స్వర్ణోత్సవ సభలో సత్యశోధక్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.చెన్నయ్య చేతుల మీదుగా శాలువా కప్పి ప్రశంసాపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మదుపాక ఎల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సంఘాన్ని బలోపేతం చేస్తున్న రాజేందర్ సేవలను అభినందించారు. కార్యక్రమంలో మాంకాల యాదగిరి, పుల్ల మల్లయ్య, తప్పెట్ల వీరన్న, బి.అరుణ్‌కుమార్, ఆరకొండ రాజయ్య, మారపెల్లి కొంరయ్య, నీరుడు సామెల్ తదితరులు పాల్గొన్నారు.