4 April, 2026 | 2:28 AM

పబ్లిక్ క్లబ్, బార్ అసోసియేషన్ నేతలకు ఘన సన్మానం

04-04-2026 12:12 AM

కోదాడ, ఏప్రిల్ 3 : కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్‌లో మిత్రమండలి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులను శుక్రవారం ఘనంగా సత్కరించారు. పబ్లిక్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన కత్రం సీతారాంరెడ్డి, పోటు రంగారావు, అలాగే కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, రామిశెట్టి రామకృష్ణలను మిత్రమండలి సభ్యులు శాలువాలతో సన్మానించారు.

మిత్రమండలి అధ్యక్షులు మేకల వెంకట్రావు మాట్లాడుతూ పబ్లిక్ క్లబ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని తెలిపారు. పైడిమర్రి సత్యబాబు, కౌన్సిలర్ యలగందల నర్సయ్య, పులగండ్ల శ్రీనివాసరావు,తీగల కరుణాకర్, కందిబండ సత్యం,పందిరి సత్యనారాయణ, భాగం వెంకట నారాయణ,మందడి రంగారెడ్డి, పసుపులేటి నాగేశ్వరరావు, నెల్లూరి వెంకటేశ్వరరావు, ఓరుగంటి రవి, మిక్కిలినేని రామారావు, ముత్తినేని సైదయ్య, తాళ్లూరి నరసింహారావు, వీరారెడ్డి లింగారెడ్డి, పాశంనాగిరెడ్డి,సూరగాని యల్లయ్య పాల్గొన్నారు.