ఎమ్మెల్యే ఇంటి క్లీనింగ్‌కు ఫైర్ ఇంజిన్
బీజేపీ నేతలు అంటే ఈ మాత్రం ఉండాలా?
బీజేపీ నేతలంటే రూల్స్ (Rules) మనకెందుకు? అన్నట్టేనా? గుజరాత్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది. ఎమ్మెల్యే బాచూభాయ్ ఖబాద్ తన ఇంటిని శుభ్రం చేసుకునేందుకు ఏకంగా ఫైర్ ఇంజిన్ (Fire Engine)ను వినియోగించారు. ప్రజల ఆస్తి అయిన ఫైర్ ఇంజిన్‌ను ఇంటి పనులకు ఉపయోగించుకోవచ్చా? అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన సిబ్బంది.. ఓ ఎమ్మెల్యే ఇంటిని కడిగేందుకు వెళ్లడం ఎంతవరకు సమంజసం? వీడియో వైరల్ (Viral) కావడంతో అధికారులు స్పందించి ఎమ్మెల్యే నుంచి రూ.2,700 రుసుము వసూలు చేయాలని ఆదేశించారు.
అయితే అసలు ప్రశ్న మాత్రం ఇదే.. ప్రజల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ వనరులను ప్రజాప్రతినిధులు వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తే.. కేవలం రుసుము చెల్లిస్తే సరిపోతుందా? లేక బాధ్యత కూడా ఉండాలా? ఎమ్మెల్యేలకు ప్రత్యేక రూల్స్ (Rules) ఉంటాయా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ నేతలు అంటే ఈ మాత్రం ఉండాలి! ఫైర్ ఇంజిన్‌తో ఇంటిని కడిగించుకున్న గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే బాచూభాయ్ ఖబాద్ వైరల్ కావడంతో బీజేపీ ఎమ్మెల్యేతో ₹2,700 రుసుము వసూలు చేయాలని ఆదేశించిన అధికారులు బీజేపీ నేతలు దేశంలో ఏం చేసినా తప్పు లేదనే అభిప్రాయంతో ఉండటం వల్ల.. ఈ మధ్య బీజేపీ నేతల దారుణాలు మరింత ఎక్కువయ్యాయని అనుకుంటున్న జనం
— greatandhra (@greatandhranews) October 6, 2026