బస్సు బైక్ ఢీ కొని ఒకరి మృతి...
06-10-2026 | 04:05pm
బాన్సువాడ, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం లోని కామిశెట్టి పల్లి(Kamishetti Palli) వద్ద ఆర్ టీ సీ బస్సు బైక్ ను ఢీ కొట్టగా బైక్ పై ఉన్న వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
నసురుల్లాబాద్ మండలం లోని హాజీపూర్ ,రాజేష్ తండాకు చెందిన కాట్రోత్ శంకర్ మిట్యా (46) నసురుల్లాబాద్ వైపునుండి తమ గ్రామానికి వెళ్లుచుండగా,నిజామాబాద్ నుండి బాన్సువాడకు వెళ్ళుతున్న బస్సు ప్రమాదం జరిగిందని,ఎస్సై రాఘవేంద్ర తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.