షారజీపేటలో బీజేవైఎం సమావేశం

06-10-2026 | 03:52pm

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అక్టోబర్ 7న సేవా జ్యోతి బైక్ ర్యాలీ..

ఆలేరు, అక్టోబర్ 7 (విజయక్రాంతి): భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం)(Bharatiya Janata Yuva Morcha) ఆధ్వర్యంలో షారజీపేటలోని పాత గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు మంత్రి సాయి ప్రసాద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ పేరపు ఆనంద్, ఆలేరు 5వ వార్డు కౌన్సిలర్ పాశికంటి సంపత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా అక్టోబర్ 7న నిర్వహించనున్న సేవా జ్యోతి బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భువనగిరిలోని సాయిబాబా ఆలయం నుంచి ప్రిన్స్ కార్నర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అజయ్, మనోజ్, దుర్గ ప్రసాద్, గౌరవదీప్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు