29 July, 2026 | 8:54 PM

భారతి నాట్యాలయంలో ఘనంగా గురుపూజోత్సవం

29-07-2026 08:09 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): గురుపౌర్ణమి పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత కొత్తగూడెంలోని, శ్రీ భారతి నాట్యాలయంలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి హరిత దీక్షకురాలు నైనిక రజువా, శ్రీ భారతి నాట్యాలయం శిక్షకురాలు పర్వీన్ చంద్‌కు మొక్కను అందజేసి గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. "మొక్కలు నాటడం ద్వారా ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత" అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాట్యాలయ విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, కళాభిమానులు పాల్గొని గురువుల పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు. గురుపూజతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గురువుల ఆశీస్సులతో విద్యార్థులు కళారంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.