29 July, 2026 | 8:46 PM

ఎడతెరిపి లేని వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

29-07-2026 08:11 PM

ఆప్ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్

భూపాలపల్లి,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అన్నారు. ఈ మేరకు అరవింద్ బుధవారం మోరంచవాగు ఉదృతిని పరిశీలించారు. గతంలో వాగు ఉదృతికి మోరంచపల్లి గ్రామం మునిగిపోయిందని ఆ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగిందని గుర్తు చేశారు. అటువంటి ఘటనలు పునరావృతం ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అధికారులు అందుబాటులో ఉంటూ నిత్యం పర్యవేక్షించేలా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా అరవింద్ విజ్ఞప్తి చేశారు.