19 March, 2026 | 1:48 AM

Breaking News

ఈదురుగాలులు.. వడగండ్ల వానలు

19-03-2026 12:36 AM
  1. జిల్లాలో తీవ్రనష్టం
  2. చెట్లు కూలి, విద్యుత్ వైర్లు తెగిపోవడంతో పలు గ్రామాలలో, పట్టణాలలో విద్యుత్ సరఫరా లో అంతరాయం
  3. చొరవ తీసుకున్న స్థానిక ప్రజా ప్రతినిధులు
  4. మున్సిపల్ చైర్ పర్సన్ల, సర్పంచులు పర్యవేక్షణలో వేగంగా పనులు పూర్తి

కామారెడ్డి/ఎల్లారెడ్డి, మార్చి 18 (విజయ క్రాంతి): ఈదురు గాలులు, వడగళ్ల వర్షం జిల్లాలో అతలాకుతలం చేశాయి. రాత్రి సమయంలో కురిసిన అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి, విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ఈదురు గాలులకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రాత్రి సమయంలో బలమైన ఈదురు గాలులు వీచడంతో విద్యుత్ స్తంభాలతో పాటు మామిడి చెట్లు కాయలు నేలకు రాలాయి.

మామిడి చెట్లకు పూతతో పాటు ఖాతా పట్టి మామిడికాయ అవుతున్న సమయంలో వడగళ్ల వాన రావడంతో పాటు ఈదురు గాలులు వియడంతో మామిడి పిందెలు నేలకు రాలాయి. దీంతో మామిడి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. కామారెడ్డి పట్టణంతోపాటు మాచారెడ్డి ఎల్లారెడ్డి బిచ్కుంద బాన్సువాడ పిట్లం నిజాంసాగర్ మద్నూర్ జుక్కల్ దోమకొండ భిక్కనూర్ పలు మండలాల్లో ఈదురుగాలతో కూడిన వడగళ్ల వాన కురవడంతో భారీగా నష్టం వాటిల్లింది.

స్థానిక ప్రజాప్రతినిధులు విద్యుత్ శాఖ  అధికారుల దృష్టికి సమస్యలను తెలియపరచడంతో వెంటనే స్పందించిన అధికారులు సిబ్బందితో మరమ్మత్తు పనులు చేపట్టారు.కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో వడగళ్ల వర్షం కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో రాత్రి పూట విద్యుత్ లేక కుటుంబాలలో ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ఎల్లారెడ్డి మండలంలోని భిక్కనూర్ గ్రామపంచాయతీలో మంగళవారం రాత్రి సంభవించిన ఈదురుగాలుల ప్రభావంతో పలు చోట్ల చెట్లు నేలకూలి, విద్యుత్ స్తంభాల వైర్లు తెగిపోవడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడింది. సమస్య తీవ్రతను గుర్తించిన సర్పంచ్ సాయిలు వెంటనే స్పందించి స్వయంగా పర్యవేక్షణ చేపట్టి చెట్లు తొలగించడం, విద్యుత్ లైన్ల మరమ్మతులు చేయించడం వంటి పనులను వేగవంతం చేశారు.

సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయించారు. ప్రస్తుతం గ్రామంలో సాధారణ పరిస్థితులు పూర్తిగా పునరుద్ధరించబడగా, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తక్షణ చర్యలతో సమస్యను పరిష్కరించిన సర్పంచ్ సాయిలు సేవలను గ్రామస్తులు ప్రశంసించారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో పలు గ్రామాల్లో తో పాటు పట్టణాల్లో సైతం తీవ్రంగా నష్టం వాటిల్లింది.

విద్యుత్ అధికారులు స్పందించి నష్టం జరిగిన చోట విరిగిన విద్యుత్ స్తంభాల చోటా నూతన విద్యుత్ స్తంభాలను అమర్చారు. తెగిపోయిన విద్యుత్ వైర్లను సరి చేశారు. విద్యుత్ అంతరాయాన్ని పునరుద్ధరించారు. రోడ్లకు అడ్డంగా పడ్డ చెట్లను ఆర్ అండ్ బి అధికారులు తొలగించారు. అకాల వర్షం వల్ల వడగళ్ల వానంతో పాటు ఈదురు గాలుల్లో బలంగా వేయడంతో నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు.