ECలో పవర్ గేమ్..? SCలో సంచలన పిటిషన్!
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్లో(Election Commission India) నిర్ణయాల ప్రక్రియపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్(Gyanesh kumar eci row) వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. ఎన్నికల సంఘంలో అధికార కేంద్రీకరణ జరిగిందంటూ సుప్రీంకోర్టులో(Gyanesh Kumar Supreme Court) ఓ పిటిషన్ దాఖలైంది. కీలక నిర్ణయాలు మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి సమ్మతి లేకుండానే తీసుకున్నారన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరారు.
అసలు పిటిషన్లో ఏముంది?
SIR (Special Intensive Revision) ప్రక్రియలో మార్పులు, Form-6లో మార్పులు, ఓటర్ల డేటా నిర్వహణలో ECINet పాత్ర, ఎలక్టోరల్ రోల్ డేటాపై నియంత్రణ వంటి అంశాలను పిటిషన్లో ప్రస్తావించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల వెలువడిన ఒక పరిశోధనాత్మక నివేదిక ప్రకారం.. 10 నెలల వ్యవధిలో సుఖ్బీర్ సింగ్ సంధు(Sukhbir Singh Sandhu), వివేక్ జోషి కొన్ని నిర్ణయాలపై కనీసం 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు పేర్కొంది. ఇందులో SIR, Form-6, ఓటర్ల డేటా నిర్వహణ, పశ్చిమ బెంగాల్లో ఓటర్లకు సంబంధించిన అప్పీళ్ల వంటి అంశాలు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. పిటిషన్లో.. ఇద్దరు కమిషనర్లకు తెలియకుండా లేదా వారి సమ్మతి లేకుండా తీసుకున్నట్లు ఆరోపిస్తున్న నిర్ణయాలను పునఃసమీక్షించాలని, Form-6ను మునుపటి విధానంలో కొనసాగించాలని, ECINetకు సంబంధించిన డేటాపై ఫోరెన్సిక్ పరిశీలన చేపట్టాలని కోరినట్లు సమాచారం. అలాగే మొత్తం వ్యవహారంపై SIT లేదా న్యాయ విచారణ ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు.
14 అభ్యంతరాలపై EC ఏమంటోంది?
ఇక ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం మరో విధమైన వివరణ ఇచ్చింది. కమిషన్లో సభ్యులు అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడం నిర్ణయ ప్రక్రియలో సాధారణ భాగమేనని పేర్కొంది. అంతేకాదు.. SIRతో పాటు గత 10 నెలల్లో తీసుకున్న నిర్ణయాలకు ముగ్గురు కమిషనర్ల ఆమోదం ఉందని EC స్పష్టం చేసింది. అంతర్గత నోట్లలో వ్యక్తమైన అభిప్రాయాలను తుది నిర్ణయాలతో సమానం చేయడం సరికాదని ఎన్నికల సంఘం పేర్కొంది. CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని Cockroach Janta Party (CJP) డిమాండ్ చేసింది. రాజీనామా చేయకపోతే అక్టోబర్ 2 నుంచి ముంబైలో దేశవ్యాప్త ఆందోళన ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. అయితే తాజా పరిణామంలో.. అక్టోబర్ 2న ముంబైలో నిరసనకు అనుమతి నిరాకరించారని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. అనుమతి రాకపోతే తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
రాజకీయంగా వేడెక్కిన SIR వివాదం
SIRపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరోవైపు BJP.. ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణలను రాజకీయ ప్రేరిత విమర్శలుగా అభివర్ణిస్తూ, కాంగ్రెస్, ప్రతిపక్ష కూటమి ఎన్నికల పరాజయాల నేపథ్యంలో రాజ్యాంగ సంస్థను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపిస్తోంది. అందువల్ల ప్రస్తుతం ఈ వ్యవహారం మూడు స్థాయిల్లో కొనసాగుతోంది—సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్, ఎన్నికల సంఘం వివరణ, రాజకీయ పార్టీల పరస్పర ఆరోపణలు. ఈ ఆరోపణలపై తుది న్యాయపరమైన నిర్ణయం వెలువడాల్సి ఉంది.