జై గౌరీపుత్ర గణేశా.. విద్యార్థులే లక్ష్యమయా!

11-09-2026 | 05:30am

శ్రీ వాత్సల్య ఆడియో అండ్ వీడియో ఇల్లస్ట్రేషన్స్ పతాకం(Illustrations Banner)పై రూపొందిన తొలి చిత్రం ‘జై గౌరీపుత్ర గణేశా’. స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర రచన, దర్శకత్వం నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న. ఈ సినిమాలో ఘర్షణ శ్రీనివాస్, కరాటే కళ్యాణి, శ్రీమణి, మారుతి సకరం, డమామ్ అభిలాష్, కావ్యశ్రీ, దివ్యశ్రీ, రాజా రామకృష్ణ వర్మ, చంద్రముఖి చంద్రశేఖర్, తిరువీధుల జయరాం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతాన్ని సందీప్ సన్నీ, వెంకట్ బాలగోని అందుస్తుండగా, డీవోపీగా నంద ఉత్తమ్‌రామ్, విజయ్ ఠాగూర్, ఎడిటర్‌గా రంగసాయి ప్రవీణ్ పనిచేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఆడియో, ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు.

స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర మాట్లాడుతూ.. “గత 26 ఏళ్లుగా తిరువన్నామలైలో వైదిక ధర్మశాస్త్రాలను అధ్యయనం చేసిన నేను, నేటి యువతలో నైతిక విలువలు, మానవతా దృక్పథాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టా. ‘జై గౌరీపుత్ర గణేశా’ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం ఆలోచించాల్సిన అంశాలను తెరపైకి తీసుకొచ్చాం.

భవిష్యత్తులోనూ సందేశాత్మక, సామాజిక, ఆధ్యాత్మిక చిత్రాలను నిర్మిస్తాం” అధ్న వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సరస్వతి ఉపాసకుడు దైవజ్ఞ శర్మ, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్, జాయింట్ సెక్రెటరీ రామసత్యనారాయణ, నటీనటులు ఘర్షణ శ్రీనివాస్ మూవీ టీమ్ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు