గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

12-09-2026 | 10:43am

పాపన్నపేట,సెప్టెంబర్12: గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఎల్లాపూర్ శివారులోని మెదక్ -బోడ్మట్ పల్లి ప్రధాన రహదారి పై(Medak - Bodmatpalli Main Road) శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, కుటింబీకుల సమాచారం మేరకు.. మండల పరిధిలోని కొత్తపల్లి  గ్రామానికి చెందిన  కొక్కులరాజు(25) ద్విచక్ర వాహనం పై మెదక్ వైపు నుండి స్వగ్రామమైన కొత్త పల్లికి ద్విచక్ర వాహనం పై వెళుతున్న క్రమంలో ఎల్లాపూర్ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రాజు రోడ్డుపై పడి తీవ్ర రక్త స్రావమై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.

అటుగా వెళ్లిన వాహనదారులు గ్రామస్థులకు, పాపన్నపేట పోలీసులకు సమాచారం అందివ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుడిని గుర్తించి కుటింబీకులకు సమాచారం అందించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి కుటింబీకుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు